మెదక్ జిల్లాలో ఫీవర్ సర్వే విస్తృతంగా సాగుతోంది. జిల్లాలో 633 బృందాలు 37,711 ఇళ్ళు సందర్శించారు. 2,443 మందికి మందుల కిట్‌లు అందజేశారు. ఎంపీడీవో, ఎంపీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వైద్య బృందం ఇంటింటికి తిరుగుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుచున్న వారికి కరోనా వైరస్ పట్ల అప్రమత్తత, జాగ్రత్తలు సూచిస్తున్నారు.