రెండు బైకులు ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన హత్నుర మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. రెస్తియాల్ పరిశ్రమ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో కంది మండలం బ్యాతోల్కు చెందిన తేజశ్రీ(3) అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు