హుజురాబాద్ డిపోలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం రాజయ్య యాక్సిడెంట్ చేశాడు. దీనికి బాధ్యత వహిస్తూ తనను సస్పెండ్ చేస్తారేమోనని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని అధికారులు పేర్కొంటున్నారు. అయితే రాజయ్య ఆత్మహత్యాయత్నానికి అధికారుల వేధింపులే కారణమని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.