రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ప్రాధాన్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందా? అని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా రైతులు రుణమాఫీ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఖమ్మం జిల్లాలో రైతులకు సుమారు రూ.250 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉన్నట్లు సమాచారం. రూ.2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం అని చెప్పడంతో, 2 లక్షలకు పైన ఉన్న మొత్తం కట్టేసి రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కాగా, పంట దిగుబడి లేక రుణానికి అసలు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
రుణమాఫీ కోసం రైతుల పడిగాపులు
ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో రైతులకు సుమారు రూ.250 కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉంది
రూ.2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాం అని చెప్పడంతో, 2 లక్షల పైన ఉన్న మొత్తం కట్టేసి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు
పంట దిగుబడి లేక రుణానికి అసలు వడ్డీ… pic.twitter.com/UzW82zRTdM
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2025