శాతవాహన వర్సిటలో తిరుగుతున్న ఎలుగును బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాత్రీ.. పగలు అన్వేషిస్తున్నా ప్రాంగణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయి.
ఆపరేషన్ సజావుగా పూర్తి చేసేలా యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కు 2 రోజులు సెలవు ప్రకటించారు. అయినా ఎలుగును పట్టుకోవడానికి అనువైన వాతావరణం లేకపోవడం సమస్యగా మారింది. బోన్లు ఏర్పాటు చేసి సీసీలతో నిఘా పెట్టారు.