IND Vs PAK : దుబాయ్ లో టీమిండియా బౌలర్ బుమ్రా సందడి

-

IND Vs PAK : ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడిన టీమిండియా బౌలింగ్ చేస్తోంది. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత స్టార్ బౌలర్ బుమ్రా దుబాయ్ స్టేడియానికి వచ్చారు. ఐసీసీ టీ-20, టెస్ట్ టీమ్ క్యాప్ లు, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డులు అందుకున్నారు.

అనంతరం టీమిండియా ప్లేయర్లతో కాసేపు ముచ్చటించారు. ఛాంపియన్స్ ట్రోపీలో ఆడాల్సిన బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా లేని లోటు షమీ తీర్చుతాడని కామెంటర్స్ పేర్కొంటున్నారు. కానీ ఇవాళ పవర్ ప్లే లో పాకిస్తాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా బౌలర్లు పాక్ జట్టును వికెట్లు తీయలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version