కాళేశ్వరం దేవస్థానంలో సాధారణ భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆలయ ఈఓ మహేశ్ రూ.1000 చెల్లింపుల ప్రత్యేక అభిషేకాలు రద్దు చేశారు. గర్భగుడి ప్రవేశం చేయకుండానే దూరం నుంచి దర్శనం చేసుకొని వెనుతిరగడంతో ఈవో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేవలం రూ.300తో అభిషేకం రూ.100తో గర్భగుడి ప్రవేశం భక్తులు చేసేలా ఏర్పాటు చేశారు. మంగళవారం నిర్వహించే కాలసర్పదోష పూజలు పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు.