హిందూపురంలో ఉత్కంఠకు తెర పడింది. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. దీంతో మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నిక అయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్ల మద్దతు రావడంతో….మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నిక అయ్యారు.
23 మంది మద్దతుగా టీడీపీకి చెందిన కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక కావడంతో… హిందూపురంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అటు విప్ జారీ చేసినా వైసీపీకి ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికలో 17 మందికే పరిమితమైంది వైసీపీ. చేతులెత్తి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు… వైసీపీకి 17 మంది మాత్రమే వేశారు. అటు దక్కరుండి చక్రం తిప్పిన ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ… హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాడు. ఇది అనైతికమంటూ వైసీపీ కౌన్సిలర్లు, కురుబ దీపిక, ఉషాశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.