పెద్దపల్లి జిల్లాలో 104 సేవలు ఆగిపోవడంతో క్రమం తప్పకుండా చేయాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. ఓ వైపు ఇంధన ధరలు పెరగడం.. మరో వైపు వాహనాలు తరచూ మరమ్మతుకు గురవుతుండటంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటి సేవలు రద్దు చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలో 49 పల్లె దవాఖానాలు మంజూరు కాగా.. కేవలం 15 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 104 వాహనాలు కూడా మూలన పడటంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.