తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సింగరేణిలో 16 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించామని, ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు వేలం వేస్తుందని అన్నారు. దీన్ని నిలిపివేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని పేర్కొన్నారు