ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కోటిరెడ్డి నేడు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్, మాజీ మండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.