మహిళ మెడలోని పుస్తెలతాడును ఓ గుర్తు తెలియని యువకుడు లాక్కొని వెళ్తుండగా పట్టుబడిన సంఘటన మెదక్‌లోని బ్రాహ్మణవీధిలో జరిగింది. బ్రాహ్మణవీధిలోని విజయలక్ష్మి అనే మహిళ ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి 3 తులాల బంగారు పుస్తెలతాడుతో పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.