మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సైతం కరోనా బారిన పడ్డారు. రాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత రెండు, మూడు రోజులుగా తనతో ఉన్న ప్రతి ఒక్కరు హోమ్ ఐసోలేషన్ ఉండాలని, ఏమైనా అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికే వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌కు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.