![crime](https://manalokam.com/wp-content/uploads/2020/07/jpg.png)
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని మల్లికార్జున కాటన్ మిల్లు వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మాసాయిపేటకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వాహనదారుడికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.