ఇంట్లో ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం అల్వాల గ్రామానికి చెందిన ప్రశాంత్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి 4నెలల క్రితమే వివాహం అయినట్లు తెలిపారు. ఈ విషయంపై ఇలాంటి ఫిర్యాదు అందలేదని మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు