పుట్టినరోజు వేడుకలకు రూ. 200 తీసుకుని వెళ్లిన ఓ వ్యక్తి శవమైయ్యడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట గ్రామ శివారులో జరిగింది. ఆయన శవం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు చందాపూర్‌కు చెందిన పోతురాజు లక్ష్మణ్‌గా గుర్తించారు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా లభించింది. గత రాత్రి పుట్టిన రోజు వేడుకల కోసం రూ.200 తీసుకొని వెళ్లాడన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ మృతిపై అనుమానాలు పలు వ్యక్తం చేస్తున్నారు.