గుడి, మసీదు, చర్చీ కన్నా… భవిష్యత్తుకు బాటను చూపేది “బడి” మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7,200 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ముందు ఉందన్నారు