SLBC టన్నెల్‌లో మృతదేహం లభ్యం అయింది. SLBC టన్నెల్‌లో మృతదేహం లభ్యం అయిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. టన్నెల్‌లో కుళ్లిన స్థితిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం అయింది. ఈ తరుణంలోనే… ప్రగాఢ సంతాపం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై కేటీఆర్ స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన సంఘటనలో 16 రోజుల నిరీక్షణ తరువాత ఒక మృతదేహం లభించడం అత్యంత బాధాకరం గా ఉందన్నారు. వెలికితీసిన మృతదేహం మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ కు చెందినదిగా అంచనా వేసిన నేపథ్యంలో.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఫల్యం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిన నేపథ్యంలో చెరో 50 లక్షల చెప్పున కోటి రూపాయల పరిహారం అందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.