ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలుపొందింది భారత్. ఈ తరుణంలోనే… 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఫైనల్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలుపొందింది భారత్. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ… జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇక టీమిండియా ఫ్రైజ్ మనీ ఎంతంటే ?
2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా $2.24 మిలియన్లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకుంది. రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు అంటే రూ. 10 కోట్లు సంపాదించింది.