కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు దశ దిశ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగం, విద్యారంగం, ఆరోగ్య శాఖ లతోపాటు గ్రామీణ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నా ఖర్చు మాత్రం ఏమాత్రం చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి క్రమంగా నిధులను తగ్గిస్తుందని అన్నారు.