కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించిన మల్క కొమురయ్య కీలక కామెంట్స్ చేసారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో నాపై దుష్ప్రచారం చేశారు. నేను కార్పొరేట్ ను కాదు. కార్పొరేట్ కు సీటు ఎట్లా ఇస్తారని ప్రచారం చేశారు. నాకు ఎడ్యుకేషన్ సిస్టం మీద పట్టుంది. ప్రచారాలను నమ్మకుండా ఉపాధ్యాయులు నాకు పట్టం కట్టారు. నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఉపాధ్యాయునికి పేరు పేరునా కృతజ్ఞతలు పేర్కొన్నారు.
ఇక 317 జీవో చాలా దుర్మార్గమైనది. 317 పై మా స్ట్రగుల్ కచ్చితంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టారులో అనేక సమస్యలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లో ఒక్కో సెక్టారుకు ఒక్కో సమస్య ఉంది, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతుంటే పిల్లలకు నాణ్యమైన చదువు ఎలా అందుతుంది.. ఉపాధ్యాయులకు ఎప్పుడు అండగా ఉంటాను. వీలైనంత వరకు ఉపధ్యాయూలతోనే ఉంటా అని మల్క కొమురయ్య పేర్కొన్నారు.