కోనరావుపేట మండలం సుద్దాల, పల్లిమక్త, కనగర్తి, నిజామాబాద్, మామిడిపల్లి, మంగళంపల్లి సుద్దాల, మారుపాక ప్రధాన కూడళ్లలో తరచూ క్షుద్రపూజలు చేస్తున్నారు. దీంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పౌర్ణమి, అమావాస్య రోజున రాత్రి వేళ కుంకుమ, కోడి గుడ్లు, నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తుంటారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి క్షుద్రపూజలు చేయకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.