
తాండూరు మండలం ఉద్దండాపూర్‌కు చెందిన బురుదొడ్డి చిన్నచంద్రప్ప గురువారం రెండో డోసు తీసుకున్నాడు. అదే రోజు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వ్యాక్సిన్ వల్లే మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా ఊపిరితిత్తుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్‌తో చిన్నచంద్రప్ప మృతిచెందినట్లు వైద్యాధికారి అపూర్వ వివరణ ఇచ్చారు.