తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కమిషనర్ MNR జ్యోతి సహా 10 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో మిగిలిన ఉద్యోగులు సైతం తీవ్ర భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంతమంది వ్యక్తిగతంగా హోమ్ క్వారంటైన్కు తరలి వెళ్లారు. దీంతో మున్సిపల్ కార్యాలయాన్ని మొత్తం శానిటేషన్ చేసి..ఎవరూ రాకుండా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు.