బర్కత్‌పురలోని ఓ దేవాలయంకు దైవ దర్శనానికి వెళ్లిన భక్తుడి ద్విచక్ర వాహనంలో నుంచి రూ.2.65 లక్షల నగదు మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కాచిగూడ భూమన్న లేన్ ప్రాంతానికి చెందిన శ్రీవన్ విజయ్ గుడికి వెళ్లి తన ద్విచక్ర వాహనాన్ని గుడి ముందు పార్కింగ్ చేశారు. వాహనంలో ఉన్న నగదును గుర్తుతెలియని దుండగులు దొంగిలించినట్లు బాధితుడు తెలిపారు.