ప్రజల బతుకు మారుస్తానని లోగోలు మారుస్తున్నడు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

అధికారంలోకి వస్తే ప్రజల బతుకు దెరువును మారుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు లోగో, పేర్లను మారుస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని.. క్రైమ్ డిటెక్షన్ లో బీహార్ కంటే తెలంగాణ వెనుకబడిందన్నారు. హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడని.. ఏమైనా అంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చామని చెబుతున్నారని.. లోగో మార్చితే.. ఏం వస్తుందని మండిపడ్డారు.

అధికారంలోకి రాకముందు ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని.. ప్రజల బతుకులు మారుస్తానని చెప్పి ఇప్పుడు లోగోలు మారుస్తున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి దారుణంగా తయారైందని.. పోలీసులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. లోగోలు మార్చడం కాదని.. పోలీసులకు అవసరం అయినా సాంకేతికతను, నిధులకు అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్రంలో చాలా సమస్యలను పోలీసులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version