మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ తూప్రాన్ ప్రధాన రహదారిపై లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో తూప్రాన్ పట్టణానికి చెందిన చాకలి రమేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తుంటాడు. ఉదయం పూట అంబర్ పేటలోని ఫ్యాక్టరీకి విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.