వైసీపీలో చేరితే రాజకీయ అత్యాచారమే : డొక్కా సంచలనం !

-

వైసీపీలో చేరితే రాజకీయ అత్యాచారమే అటూ టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. సీనియర్ నేత శైలజానాథ్.. వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్ కు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ కీలక సూచనలు చేశారు.

TDP leader Dokka Manikyavaprasad gave important instructions to Shailajanath

పార్టీలో చేర్చుకునేటప్పుడు వైసీపీలో నేతలందరూ అప్యాయంగా ఉంటారని.. ఆ తర్వాత రాజకీయ అత్యాచారం చేయిస్తారని అన్నారు. వైసీపీలో విలువలు ఉండవని.. అదో దుర్మార్గమైన పార్టీ అని అన్నారు. జగన్ పార్టీలో దళితులకు స్థానం లేదన్న డొక్కా.. ఆ పార్టీలో చేరికతో రాజకీయ సమాధి తప్పదన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇది ఇలా ఉండగా…. వైసీపీ లో చేరారు మాజీ మంత్రి శైలజానాథ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీ లో చేరారు శైలజానాథ్. వైసీపీ కండువా వేసి శైలజానాథ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version