తణుకులో తీవ్ర ఉద్రిక్తత.. మహిళపై ఖాళీ మద్యం బాటిళ్లు విసరడంతో..

-

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దువ్వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న సూర్య దేవాలయంలో మాఘ మాసం రథసప్తమి వేడుకల్లో భాగంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమం చేసుకుంటున్నారు.

ఆ సమయంలో హిందూయేతర వ్యక్తి వచ్చి భజన చేస్తున్న మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే మరో 10 మంది ఇతర మతస్తులు హిందూ మహిళలపై ఖాళీ మద్యం బాటిళ్లు విసిరారు. దీంతో దువ్వలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోంది. అన్యమతస్తులు హిందూ మహిళలతో విచక్షణా రహితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ గొడవను సర్దుమణిగింప చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version