రామగుండం: సోమవారం పట్టణంలోని ఓసీపీ 2 సింగరేణి కాలువలో పడి రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన తంగళ్లపల్లి విష్ణువర్ధన్(15) మరణించాడు. స్థానిక కాకతీయ పాఠశాలలో విష్ణువర్ధన్ పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కాలువ వద్దకు వెళ్లగా.. కాలువలో పడడంతో గమనించి బైటకు తీసి సెంటినరీ కాలనీ డిస్పెన్సరీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.