రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనం కానిస్టేబుల్ అబ్బాస్‌పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన కుడికాలికి తీవ్ర గాయమైంది. తోటి సిబ్బంది వెంటనే స్థానికుల సహాయంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.