గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను గురువారం వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరి దగ్గర నుండి 22 నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్టాప్, ప్రింటర్స్ స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు.