ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ పరిధిలోని చిన్న గంగారం గ్రామ సమీపంలో కంతి వీర్రాజు అనే వ్యక్తి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతిగా మద్యం సేవించడం వలనే అతను మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు.