సీఎం కుమారస్వామి సర్కారుకు రేపే ఆఖరు రోజా..?

-

రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష కనుక జరగకపోతే గవర్నర్ వాజుభాయ్ వాలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన‌నే ఆసక్తి కూడా అంద‌రిలోనూ నెలకొంది. ఆయన రెండుసార్లు బల పరీక్షకు గడువు ఇచ్చినప్పటికీ సీఎం కుమారస్వామి పట్టించుకోలేదు.

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రాజ్యాంగ సంక్షోభంగా మారుతోంది. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చినా కుమారస్వామి దాన్ని వాయిదా వేశారు. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు బలం నిరూపించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నా చర్చ పేరిట కుమారస్వామి సాగతీత ధోరణిలో వ్యవహరిస్తుండడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో రేపు కర్ణాటక అసెంబ్లీలో ఏం జరుగుతుందోన‌ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో అవిశ్వాసంలో పడిపోయిన కర్ణాటక సర్కారు బల పరీక్షలో కచ్చితంగా నెగ్గే పరిస్థితి లేదని తెలుస్తుండగా.. రేపే కుమారస్వామి సర్కారుకు ఆఖరి రోజని అనిపిస్తోంది. రేపు కర్ణాటక అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోన‌నే విష‌యంపై కుమారస్వామి సర్కారు భవితవ్యం ఆధారపడి ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ప్రస్తుత కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మెజారిటీ సభ్యుల బలం లేకపోవడంతో కచ్చితంగా ఆ కూటమి బలపరీక్షలో విఫలమవుతుందని బీజేపీ దృఢమైన విశ్వాసంతో ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు సభలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే రేపు కూడా బలపరీక్ష చేసుకోకుండా కుమారస్వామి సర్కారు యధాతథంగా చర్చ కొనసాగిస్తే.. మంగళవారం బీజేపీ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

రేపు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష కనుక జరగకపోతే గవర్నర్ వాజుభాయ్ వాలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన‌నే ఆసక్తి కూడా అంద‌రిలోనూ నెలకొంది. ఆయన రెండుసార్లు బల పరీక్షకు గడువు ఇచ్చినప్పటికీ సీఎం కుమారస్వామి పట్టించుకోలేదు. ఈ క్రమంలో రేపు గవర్నర్ ఎలా వ్యవహరిస్తార‌నే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి బలం లేనందున ఎప్ప‌టికైనా సరే ఆ ప్రభుత్వం పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక కొత్త సీఎంగా య‌డ్యూరప్ప తిరిగి పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version