కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి… తమ బెడ్, హౌస్ ను ఒకసారి తిరిగి చూసుకున్నారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ దక్కించుకున్న కంటెస్టెంట్లలో శ్రీముఖి ఒకరు.
బిగ్ బాస్.. మొదటి రెండు సీజన్లలో వివాదాలేమీ లేకున్నప్పటికీ.. మూడో సీజన్ లో ఎన్నో వివాదాలు. అయినప్పటికీ.. ఆ వివాదాలను లెక్క చేయకుండా… బిగ్ బాస్ సీజన్ 3 ని స్టార్ట్ చేసేశారు. ఇక.. హోస్ట్ హోదాలో కింగ్ నాగార్జున మెరిశారు.
ఇక.. కంటెస్టెంట్లు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి… తమ బెడ్, హౌస్ ను ఒకసారి తిరిగి చూసుకున్నారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ దక్కించుకున్న కంటెస్టెంట్లలో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి అనగానే పటాస్ యాంకర్ అని అంటారు. కానీ.. శ్రీముఖి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవేంటే ఈసందర్భంగా తెలుసుకుందాం పదండి.
శ్రీముఖిది తెలంగాణలోని నిజామాబాద్. ఆమె వయసు 26 ఏళ్లు. 1993 మే 10న శ్రీముఖి జన్మించింది. రాంకిషన్, లత అనే దంపతులకు శ్రీముఖి జన్మించింది. ఆమెకు ఒక సోదరుడు శుశ్రుత్ ఉన్నాడు.
2012లో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో మొదటిసారిగా వెండితెరపై మెరిసింది శ్రీముఖి. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అయితే.. శ్రీముఖి సినిమాల్లోకి రాకముందే.. వ్యాఖ్యాతగా చేసిన అనుభవం ఉంది. అదుర్స్, సూపర్ సింగర్ 9 లాంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా శ్రీముఖి వ్యవహరించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మీ తలుపు తడితే, సావిత్రి, జెంటిల్ మెన్ లాంటి తెలుగు సినిమాల్లో శ్రీముఖి నటించింది.
ఒక్క తెలుగులోనే కాదు.. తమిళంలో ఎట్టుతిక్కుం మధయానై అనే సినిమాలో, కన్నడంలో చంద్రిక అనే సినిమాలో నటించింది.
ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో పటాస్ కు యాంకర్ గా అవకాశం వచ్చింది. పటాస్ లో బాగా ఫేమస్ అయింది శ్రీముఖి. అందుకే అందరూ ఆమెను పటాస్ శ్రీముఖి అని పిలుస్తారు. తర్వాత చాలా షోలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తన లొడలొడా వాగే మనస్తత్వమే తనకు ఆఫర్లు తీసుకొచ్చింది. శ్రీముఖి మాట్లాడటం మొదలు పెట్టిందంటే అంతే.. పక్కన ఉన్న వాళ్ల చెవులకు రంధ్రాలు పడాల్సిందే. అందుకే తనను అందరూ వాగుడుకాయ అని కూడా పిలుస్తుంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె ఓ సెలబ్రిటీ. అయితే.. ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కింది. అదే బిగ్ బాస్ షో ద్వారా.
మరి.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన శ్రీముఖికి ఈసందర్భంగా మనమంతా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతామా?