చెదురుతున్న డాలర్‌ డ్రీమ్స్‌.. మన కోసమే మనం ఇక

-

ఎన్నెన్నో కలలతో విదేశాలు చేరిన మన యువత పరిస్థితి కరోనా సంక్షభంలో బలి కావాలసి వస్తోందా..? చాలా మంది ఉద్యోగాలు కోల్సోయిన బాధతో స్వదేశం రానున్నారా..? అంటే అవుననే సమాధానం వినవస్తుంది. గోరుముద్దలతోనే విదేశాలపై ఆసక్తిని పెంచుతున్న తల్లి తండ్రులు, అల్లుడు అమెరికాలో జాబ్‌ చేస్తున్నాడంటే గొప్పగా ఫీలయ్యే అత్తమామలు.. విదేశాల్లో జాబ్‌ చేస్తున్నారంటే ఎగేసుకునే రెడీగా ఉండే ఆడపిల్ల తల్లితండ్రులు.. ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ తమ పిల్లలు ఎలా ఉన్నారో అంటూ బాధపడుతన్నారు. అమెరికా సంబంధం అంటే వద్దు బాబోయ్‌ అనుకునేలా తయ్యారయ్యింది పరిస్థితి… అమెరికా సంబంధం అంటూ కుదుర్చుకున్న పెళ్లిల్లూ వద్దనుకుంటున్న పరిస్థితి..

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అధః పాతాళానికి నెట్టేసింది. అగ్రరాజ్యం, క్రింది రాజ్యం అనే తేడాలు తేకుండా అందరికీ సమన్యాయం చేసింది. ఒకవైపు ప్రాణాలను తీసుకుంటూ భయాన్ని తెలియజేసింది. మరో వైపు ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా ఉద్యోగస్తుల పాలిట శాపంగా మారుతుంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కష్టకాలం అంటూ భారీగా ఉద్యోగాలు కోసే పనిలో పడింది. హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడం భారతీయ ఉద్యోగులకు ఎసరు పెట్టింది. ఇది హెచ్‌-1బీ వీసాతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు శాపంగా మారింది. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటంతో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది.

అమెరికా, సింగపూర్‌, ఆస్ట్రేలియా ఇలా ఏదేశం పేరు చెప్పినా మన భారతీయులు పని చేస్తేనే ఇన్నాళ్ళు అగ్ర పథాన నిలిచాయనడంలో సందేహాం లేదు. తక్కువ జీతానికి (వాళ్ళ దేశంలోని జీతాలతో పోలిస్తే) పనిచేసేది భారతీయులే. ఒక్కసారి రూపాయల జీతం కాస్తా డాలర్లుగా మారడంతో డాలర్‌ X రూపాయి లెక్కలేసుకుంటూ సంపాదించిన డబ్బులను మనదేశంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. దాచుకోవడం వరకు బాగానే ఉంది. కొంత మంది అక్కడ లోన్‌లు తీసుకొని (అక్కడ లోన్‌లకు వడ్డీ రేటు చాలా తక్కువ) మన దగ్గర భూములపై లేదా వేరే రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తారు. అలా దాదాపుగా లక్షల రూపాయలు ఈఎమ్‌ఐలు కడుతున్నారు.

ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగాలు పోవడంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో పడిపోతున్నారు. తిరిగి స్వదేశానికి రావటానికి విమాన టిక్కెట్‌కు డబ్బులు కూడా లేని వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ఇప్పటికిప్పుడు వారు కొన్న ఫ్లాట్‌లు కొనడానికి ఎవరు ముందుకు వస్తారు..? ఒకవేళ వచ్చినా అత్తెసరు ధరకు కొంటారు. మొత్తం డబ్బులు ఒక్కసారిగా ఇవ్వరు.. ఇది ప్రస్తుతం వారి పరిస్థితి.

డబ్బులు మొత్తం కడితేనే మనదగ్గరికి వచ్చే పరిస్థితి. ఇది వదిలేసినా.. ఇప్పటివరకు అందరూ తమను ఆహా ఓహో అంటూ చూశారు.. ఇప్పుడిలా ఉద్యోగం కోల్పోయి వస్తే అందరూ వెటకారం చేస్తారనే బాధ మరొకటి.. ఒకరికోసం కాదు నీ కోసమే నువ్వు బతుకు.. ఎందుకంటే నీకు ఉండేది నువ్వే…!

సోదరులారా.. మన ప్రతిభను మన దగ్గర చూపిద్దాం.. అవకాశాలు ఎన్నో ఉన్నాయి.. అధైర్యపడవద్దు.. మిత్రులారా మీరు వెళ్ళి పని చేసింది పరాయి దేశంలో, పరాయి దేశం కోసం., వాళ్ళు మనకోసం ఆలోచించరు.. మన కోసం ఆలోచించేది మన దేశమే.. రండి.. తిరుగు ప్రయాణం మొదలెట్టండి.. మన దగ్గరలేనిది ఏదీ లేదు.. మన తెలివితేటలు మనకోసం ఉపయోగిద్దాం.. నిజమనుకుంటే షేర్‌ చెయ్యండి.. మేక్‌ ఇన్‌ ఇండియా

-RK

Read more RELATED
Recommended to you

Exit mobile version