మ‌నం స‌ర‌దాగా అనుకున్న‌వ‌న్నీ ఇప్పుడు నిజం అవుతున్నాయ్‌.. భ‌రించ‌డ‌మే ఇబ్బంది!!

-

సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌నాలు ఏమ‌నుకున్నారో.. ఏమో.. కొన్ని మాట‌లు వైరల్ అయ్యాయి. అవి జోకులుగా పేలాయి క‌డుపుబ్బ న‌వ్వించాయి. అయితే, ఆ జోకులు..స‌ర‌దా మాట‌లు.. నిజ‌జీవితంలో నిజం అవుతాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. మాట వ‌ర‌స‌కు కూడా `ఇవి నిజం అవుతాయి సుమా!`-అని కూడా అనుకోలేదు. కానీ, ఇప్పుడు అవి నిజ‌మ‌య్యాయి. క‌రోనా దొంగ‌చాటుగా విన్న‌దో.. లేక‌, మ‌నం వాడిన చైనా యాప్‌ల ద్వారా తెలుసుకుందో ఏమో కానీ.. ఆయా స‌రదా మాట‌లు, జోకుల‌ను మ‌న జీవితాల్లో నిజం చేసేసింది. దీంతో త‌ట్టుకోలేక ప్ర‌తి ఒక్క‌రూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రి ఆ జోకులేంటో.. స‌ర‌దా మాట‌లేంటో కొన్ని చూద్దాం..

స‌ర‌దా కామెంట్‌: వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డు పంపించారు.. మా ఆశార్వాదాలు కూడా వాట్సాప్ చేస్తాం!

నిజం: ఇప్పుడు నిజంగానే ఇది జ‌రిగింది. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా పెళ్లిళ్ల‌కు హాజ‌రు కాలేని ప‌రిస్థితిని క‌రోనా తెచ్చేసింది. ప్ర‌భుత్వాలు కూడా 50 మందికి మించి హాజ‌రుకావ‌ద్ద‌ని హుకుం జారీ చేశాయి. కేసులు కూడా పెడుతున్నాయి.

స‌ర‌దా కామెంట్‌: అబ్బ ఈ చెత్త సినిమాలు చూడ‌లేక ఛ‌స్తున్నాం.. సినిమాహాళ్ల‌న్నీ మూత‌బ‌డితే బాగుణ్ణు!

నిజం: క‌రోనా ఎఫెక్ట్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా హాళ్లు ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మ‌న దేశంలో మార్చి 20 నుంచి మూత‌బ‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

స‌ర‌దా కామెంట్: వ‌చ్చేదంతా టెక్నాల‌జీ కాలం.. మ‌రో ప‌దేళ్లు ఆగితే.. అన్నీ ఆన్‌లైన్ అయిపోతాయి!

నిజం: క‌రోనా ఎఫెక్ట్‌తో ఇప్ప‌టికే సగం ప్ర‌పంచానికిపైగా ఆన్‌లైన్ అయిపోయింది. పాఠాలు, ప‌రీక్ష‌లు అన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ చేసేశారు. మున్ముందు.. మ‌రిన్ని రంగాల‌వారు కూడా ఆన్‌లైన్ బాట‌లోనే న‌డ‌వ‌నున్నారు.

స‌ర‌దా కామెంట్‌:  మీరు అకౌంట్‌లో డ‌బ్బులు వేస్తే.. మేం ఆన్‌లైన్‌లో మీకు పూజ జ‌రిపిస్తాం అంటూ.. కొంతమంది సిద్ధాంతులు ప్ర‌క‌టించేవారు. దీనిని చూసి అంద‌రూ న‌వ్వుకునేవారు. ఇది ఆర్జ‌న‌లో భాగంగా చేస్తున్న మోసం అనుకున్నారు.

నిజం: ఇప్పుడు ఇదే నిజ‌మైంది. దాదాపు అన్ని ప్ర‌ధాన ఆల‌యాలు కూడా ఆన్‌లైన్ పూజ‌లు చేస్తున్నాయి. ప్ర‌సాదాలు.. పూలు ఇంటికేమీ పంపించ‌రు. కేవ‌లం చెప్పిన స‌మ‌యానికి స్లాట్ రూపంలో ఫోన్ ఆన్‌చేసుకుని కూర్చుంటే.. అక్క‌డి నుంచి ఆన్‌లైన్‌లోనే ఆశీస్సులు.. హార‌తులు ఇస్తున్నారు.

కామెంట్‌:  రోజూ.. మా ఇంటికి ప‌దిమంది త‌క్కువ కాకుండా వ‌స్తున్నారు. ఫుల్ బిజీ!

నిజం: క‌రోనా ఎఫెక్ట్‌తో ఎవ‌రూ ఎవ‌రి ఇంటికీ వెళ్లే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎవ‌రి ఇళ్ల‌లో వారే.. ఎవ‌రి ప‌రిస్థితి వారిదే!

కామెంట్‌:  సొంత బంధువులండీ.. మా వాళ్లు చ‌చ్చిపోతే..క‌నీసం చూడ్డానికి కూడా రాలేదు. మాన‌వ‌త్వం లేదు!

నిజం: క‌రోనా దెబ్బ‌.. మ‌నుషుల‌నే కాదు.. మాన‌వ‌త్వాన్ని కూడా పీల్చి పిప్పిచేసేసింది. బంధువుల మాట అటుంచితే.. క‌ట్టుకున్న భార్య‌ను భ‌ర్త‌, భ‌ర్త‌ను భార్య‌, క‌డుపున పుట్టిన పిల్ల‌లుకూడా ప‌రామ‌ర్శించ‌లేని ప‌రిస్థితులు.. చుట్టుముట్టాయి. ఇక‌, ఇప్పుడు మాన‌వ‌త్వం.. బంధుత్వం అనే మాట‌లే వినిపించ‌డం లేదు.

కామెంట్‌: అమెరికాలో మావాడికి గ్రీన్ కార్డ్ వ‌చ్చింది. ఉయార్ సో.. ప్రౌడ్‌.. అండ్ హ్యాపీ

నిజం: ఇప్పుడు అమెరికా అంటేనే అల్లాడి పోతున్నారు. పిలిచి పిల్ల‌నిస్తాన‌ని ట్రంప్ అన్నా.. వ‌ద్దులే బాబూ.. నీకు, నీదేశానికోన‌మ‌స్కారం అంటూ.. అక్క‌డ ఉన్న‌వారు కూడా త‌ట్టాబుట్టా స‌ర్దేస్తున్నారు.

కొస‌మెరుపు: క‌రోనా విల‌యంతో మ‌న దేశ‌మే కాదు.. ప్ర‌పంచం మొత్తం అల్లాడిపోతోంది. బంధాల‌కు బాంధ‌వ్యాల‌కు విలువ ఇచ్చే భార‌త్‌లో, శాస్త్రాల‌కు పూజ‌ల‌కు, నిష్ట‌ల‌కు ప్రాధాన్య‌మిచ్చే దేశంలో.. “మాకు ఉగాది లేదు.. ఉష‌స్సులు లేవు`‌` అన్న క‌విగారి వ్యాఖ్య‌ల‌ను క‌రోనా నిజం చేసింద‌నే వ్యాఖ్య‌లు త‌ప్ప మ‌రేమీ వినిపించ‌డం లేదు.. ముఖాల‌కు మాస్కులు త‌ప్ప‌.. మ‌నుషులు క‌నిపించ‌డం లేదు!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version