ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత పాకిస్తాన్ 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే లైవ్ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ అబిమానులు పెద్ద ఎత్తున దుబాయ్ తరలివెల్లారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
వీరిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి, ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డైరెక్టర్ సుకుమార్, ఎంపీ కేశినేని చిన్న సహా పలువురు తెలుగు ప్రముఖులు క్రికెట్ స్టేడియంలో కనిపించారు. వీరంతా హై ఓల్డేజ్ మ్యాచ్ ను లైవ్ లో తిలకించేందుకు దుబాయ్ వెళ్లారు. పాక్ బ్యాటర్లను భారత బౌలర్లు చిత్తు చేయడాన్ని కళ్లార చూసి తెగ సంబురపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారత ఓపెనర్లు రోహిత్, గిల్ షాట్లను కూడా షేర్ చేస్తున్నారు.