కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షపై ఇవాళ రాత్రికి ఓటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఇప్పటికే బలపరీక్షకు రెండు సార్లు డెడ్‌లైన్ విధించారు. అయినా బలపరీక్ష జరగలేదు.
కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిన కర్ణాటక సర్కారు.. ఇవాళా.. రేపా.. అన్నట్లు ఊగిసలాడుతోంది. అందులో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో రోజూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం కుమారస్వామి సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ కూడా వాడి వేడిగా చర్చ జరిగింది. గత ఐదారు రోజులుగా సభను సాగదీస్తూ సీఎం కుమార స్వామి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఇక కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు ఎంత మాత్రం కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది.
కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్షపై ఇవాళ రాత్రికి ఓటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఇప్పటికే బలపరీక్షకు రెండు సార్లు డెడ్‌లైన్ విధించారు. అయినా బలపరీక్ష జరగలేదు. దీంతో ఇవాళ రాత్రి 9 గంటల లోపు బలం నిరూపించుకోవాలని మరోసారి ఆయన సీఎం కుమారస్వామి సర్కారుకు డెడ్‌లైన్ విధించారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల లోపు బల పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే బలపరీక్ష జరగక ముందే కుమారస్వామి తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆయన గవర్నర్‌ను ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరిన దృష్ట్యా అది ఆయన రాజీనామా కోసమే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కాగా రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి ఎలాగో రాజీనామాలను ఉపసంహరించుకునేలా చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలో నేడో, రేపో సీఎం కుమారస్వామి దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..!