సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి మరియు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ని కి సంబంధించి పలు విషయాలు చెప్పింది. అయితే కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులుకి పరీక్షలని మళ్ళీ నిర్వహిస్తారు. కేవలం ఆ విద్యార్థులు రిపోర్టులు చూపిస్తే చాలు అని చెప్పింది. దీనితో విద్యార్థులకు ఊరట కలగనుంది.
తాజాగా సీబీఎస్ఈ కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ప్రాక్టికల్ ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి చింత పెట్టుకోవద్దని చెప్పేసింది. అటువంటి విద్యార్థులకి ఏప్రిల్ లో లేదా రాత పరీక్ష అయిపోయాక ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. సీబీఎస్ఈ కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులు రిలాక్స్ అవ్వమని అంది. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండమని చెప్పింది.
ఈ వార్త విన్న తల్లిదండ్రులు కి కూడా ఊరట కలిగింది. సీబీఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు మే 3 నుంచి మొదలవుతున్నాయి. పరీక్షలు ఆలస్యంగా రావడం వల్ల ప్రిపేర్ అవడానికి విద్యార్థులకు ఎక్కువ సమయం ఉంది.
ఒకవేళ విద్యార్థి ఏమైనా కారణాల వలన ఎగ్జామ్ సెంటర్ ని మార్చుకోవాలంటే కూడా మార్చుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తారు. మీరు మీ సొంత ప్రదేశం లో సెంటర్ ని మార్చుకోవాలి అంటే మీరు అప్లై చేయొచ్చు. అయితే ఫైనల్ నిర్ణయం CBSE తీసుకుంటుంది. ఒకవేళ విద్యార్థులు రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవాలంటే అప్పుడు వేరే వేరే పాఠశాలలో సెంటర్ వస్తుంది.