డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

jobs

ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం తొమ్మిది ఖాళీలు వున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్‌ పోస్టులును సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ భర్తీ చేస్తోంది. ఫైనాన్స్‌, క్యూలిటీ అస్యూరెన్స్‌, ఐటీ, ప్రొక్యూర్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.

ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు. ఇక అర్హతల విషయం లోకి వస్తే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీకామ్‌/బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంసీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే… ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్‌ 8, 2022. పూర్తి వివరాల కోసం http://cmss.gov.in/ లో చూడండి.

దరఖాస్తు చేయడానికి చిరునామా: జనరల్ మేనేజర్‌ (అడ్మినిస్ట్రేషన్‌), సీఎంఎస్ఎస్‌, 2వ ఫ్లోర్‌, విశ్వ యువక్‌ కేంద్ర, టీన్‌మార్తి మార్గ్‌, చాణక్యపురి, న్యూఢిల్లీ 110021.

Read more RELATED
Recommended to you

Exit mobile version