జేఈఈ కి ప్రిపేర్ అవుతుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. పక్కా మంచి ర్యాంక్ వస్తుంది..!

-

జేఈఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా ఏకాగ్రతతో ప్రతిరోజు చదవడానికి ఎంతో సమయాన్ని కేటాయించాలి. మంచి ఫలితాన్ని పొందాలంటే తప్పకుండా ఈ టిప్స్ ను పాటించాలి. కొంతమంది అందరి సలహాలు, సూచనలు తీసుకుని మంచి మార్గాన్ని ఎంచుకోరు. కొన్ని టిప్స్ పాటించడం వలన చాలా పొరపాట్లు జరుగుతాయి. ప్రతి విద్యార్థి ప్రశ్నల తీరు ఎలా ఉంటుందో గమనించాలి. మార్కింగ్ స్కీం పై చాలా అవగాహన ఉండాలి. దాని వలన ఎంతో సులువుగా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉండడం వలన కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ ఎంపిక చేసుకుని జవాబులు రాయాలి. ఇలా చేయడం వలన నెగటివ్ మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రశ్న పత్రంలో ఇచ్చిన ప్రతి సెక్షన్ కు కొంత సమయాన్ని కేటాయిస్తే ఇచ్చిన సమయంలో పరీక్షను ముగించవచ్చు. ఇలా చేయకపోతే చివరి నిమిషంలో సమయం లేకపోవడం వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రశ్న పత్రం చూసిన తర్వాత తెలిసిన ప్రశ్నలను ముందుగా సమాధానాలు రాయాలి. ఇలా చేయడం వలన నమ్మకం పెరుగుతుంది. దాంతో సమయానికి పరీక్షను పూర్తి చేసి మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాక పరీక్షను ఎంతో ఉత్సాహంగా కూడా రాస్తారు. చాలా మంది సమాధానం విషయంలో సందేహం ఉన్నప్పుడు ఎలిమినేషన్ పద్ధతి ను ఎంపిక చేసుకోరు. ఇలా చేయకపోవడం వలన తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందేహం ఉన్నా ఆప్షన్స్ ను చూసి సరైన పద్ధతిలో ఎలిమినేషన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షకు వెళ్లే ముందు నిత్యం మాక్ టెస్టులను రాయాలి. ఇలా చేయడం వలన మనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో మనకి తెలుస్తుంది. పరీక్ష లో కొన్ని టాపిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న టాపిక్ లను ఎంపిక చేసుకుని వాటి పై శ్రద్ధ పెట్టాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version