MMTS బాధితురాలిని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

-

సికింద్రాబాద్ MMTS రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆరోగ్య పరిస్తితిని తెలుసుకున్నారు. అనంతరం మరింత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడారు. బాధితులపై దాడి జరిగి వారం గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు.

అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నిందితులను పట్టుకున్నామని ప్రకటిస్తే.. పోలీసులేమో నిందితుల కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. అసలు ఎవరి మాటలు నమ్మాలి అని ప్రశ్నించారు బండి సంజయ్. ఒకవైపు పోలీసులు ఇంకా పట్టుకోలేదని మాట్లాడుతుంటే.. నిండు అసెంబ్లీలో ఆల్రెడీ పట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఏంటి..? అని ఫైర్ అయ్యారు. తక్షణమే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించి బాధితురాలిని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version