కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు… ఇలా దరఖాస్తు చేసుకోండి..!

-

ఉద్యోగాలు: మీరు మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చెయ్యవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. నోటిఫికేషన్‌ లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న నాన్‌ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో మొత్తం 50 ఖాళీలు వున్నాయి.

నాన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. మెకానికల్‌, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, సెక్రటరీ,
కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ప్యాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఈ పైన తెలిపిన విభాగం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా సంబంధిత విభాగం లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత అప్లికేషన్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అభ్యర్థులకు నెలకు రూ. 25000 నుంచి రూ. 86,400 వరకు జీతం ఇస్తారు. దరఖాస్తులను జనరల్ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌, మంగళూరు – 757030, కర్నాటక అడ్రస్‌కు పంపాలి. పూర్తి వివరాలని http://advt88.recttindia.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version