నిరుద్యోగులకి గుడ్ న్యూస్…ఆంధ్రప్రదేశ్‌లో 2,213 ఉద్యోగాలు…!

-

మీరు ఉద్యోగం కోసం చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ ని విడుదల చేసింది. రెండు నోటిఫికేషన్స్ ద్వారా 2,213 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. ఓ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది.

దీనిలో 1,317 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. అర్హత వివరాలని నోటిఫికేషన్ లో చూడండి. ఆర్డర్లీ పోస్టులు 839 ఉన్నాయి. 10వ తరగతితో పాటు ఫస్ట్ ఎయిడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఉన్న వారు అర్హులు. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 17 ఉన్నాయి.

డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పాస్ కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయితే అప్లై చేసుకోచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 124 ఉన్నాయి. 10వ తరగతితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.

ఇది ఇలా ఉంటే మరో నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 896 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల్లోగా అప్లై చేయాలి. గైనకాలజీ- 302, పీడియాట్రిక్స్- 120, అనస్తీషియా- 118, జనరల్ మెడిసిన్- 61, జనరల్ సర్జరీ- 53, ఆర్థోపెడిక్స్- 29, ప్యాథాలజీ- 19, ఆప్తమాలజీ- 29, రేడియాలజీ- 21, సైకియాట్రి- 8, డెర్మటాలజీ- 13, ఈఎన్‌టీ- 21, సీఎఎస్ జనరల్- 86, డీఏఎస్- 16 ఖాళీలున్నాయి. https://dmeaponline.com/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version