స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 333 ఖాళీలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా LTD (SAIL) నోటిఫికేషన్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 333 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2022. పోస్టుల వివరాలను చూస్తే.. ఎగ్జిక్యూటివ్‌లు 8 పోస్టులు (అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు), నాన్ ఎగ్జిక్యూటివ్స్ 325 పోస్టులు. వీటిలో ఆపరేటర్-కమ్ టెక్నీషియన్, మైనింగ్ ఫోర్‌మాన్, సర్వేయర్, మైనింగ్ మేట్, ఫైర్ ఆపరేటర్, ఫైర్‌మ్యాన్-కమ్-ఫైర్ ఇంజిన్ డ్రైవర్, అటెండెంట్-కమ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

వేరు వేరు పోస్టులకి వేర్వేరు విద్యార్హతలు వున్నాయి. పారిశ్రామిక భద్రతలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలానే ఒడియా భాషపై తగిన పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి. అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ sailcareers.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. కనీసం వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 28-30 సంవత్సరాలు ఉండాలి. పూర్తి వివరాలను sailcareers.com వద్ద చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version