6990 నాన్‌ టీచింగ్‌ జాబ్స్‌… అర్హత, అప్లై చేసుకునే విధానం మొదలైన వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్రీయ విద్యాలయ సంగతన్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. పూర్తి వివరాలలోకి వెళితే.. 6990 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు వున్నాయి. పోస్టులు, అర్హత వివరాలను చూద్దాం.

B.Ed మరియు సంబంధిత ఫీల్డ్ అనుభవంతో పీజీ పూర్తి చేస్తే అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు కి అప్లై చెయ్యచ్చు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52 వున్నాయి. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి 15 సంవత్సరాల అనుభవంతో పాటు B.Ed పూర్తి చేసి ఉంటే ప్రిన్సిపల్ పోస్టులు కి అప్లై చెయ్యచ్చు. 239 ఖాళీలు వున్నాయి. వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

ఇదిలా ఉంటే వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 203 వున్నాయి. మాస్టర్ డిగ్రీ తో పాటుగా ఐదు సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేస్తే ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అయితే 1409 వున్నాయి. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళే అర్హులు. సంబంధిత సబ్జెక్ట్‌లో 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేసుండాలి. లైబ్రేరియన్ పోస్టులు 355 వున్నాయి. లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ కానీ లైబ్రరీ సైన్స్‌లో ఏడాది డిప్లొమా డిగ్రీ వున్నా అర్హులే.

ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్ లో 303 ఖాళీలు వున్నాయి. 10+2 తో పాటు సంగీతంలో డిగ్రీ ఉండాలి. అలానే ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు 06 వున్నాయి. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 02 వున్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 156 వున్నాయి. హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులు 11, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల 322 వున్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 702 వున్నాయి. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు 54 వున్నాయి. డిసెంబర్‌ 26, 2022 లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version