ఈనెలాఖరులో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే అక్కడ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు నువ్వా నేనా? అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం పరోక్షంగా చీపురు పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గనడం లేదని సమాచారం.
ఇక బీజేపీ తరపున ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో ప్రచారం చేపట్టారు.ఆదివారం గోండా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అక్కడి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అజయ్ మహావర్‌ను గెలిపించాలని, డిల్లీలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీకి మరింత బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం అందరూ ఇంట్లోనే ఉంటారని మీ ఇంటికి వచ్చాను.. అంటూ కర్తాల్ నగర్ స్థానికులతో మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక్కడ సీఎం 16 నెలలు జైల్లో ఉన్నారని గుర్తుకు చేశారు. ఢిల్లీలో 25 ఏళ్ల తర్వాత బీజేపీ గెలవబోతుందని స్పష్టంచేశారు.