మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (CPMU) కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.
2021 నవంబర్ 10 అప్లై చెయ్యడానికి చివరి తేదీ. దీనిలో మొత్తం ఏడు ఖాళీలు వున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, వంటి ఖాళీలని భర్తీ చేస్తోంది. వీటి కోసం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. వయస్సు 50 ఏళ్ల లోపు ఉండాలి. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఇక పోస్టుల వివరాల లోకి వెళితే… సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) 1 ఖాళీ వుంది. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్ 2 ఖాళీలు వున్నాయి. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటీవ్) 2 ఖాళీలు వున్నాయి. ఎంబీఏ (హెచ్ఆర్, ఫారిన్ ట్రేడ్, టూరిజం, ఇంటర్నేషనల్ బిజినెస్) పూర్తి చేసిన వారు అర్హులు.
డేటా అసిస్టెంట్ 1 ఖాళీ వుంది. కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 1 ఖాళీ వుంది. 10+2 లేదా తత్సమాన అర్హత ఉంటే అప్లై చెయ్యచ్చు. అలానే ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్ కౌన్సిల్, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలని https://cdn.ayush.gov.in/wp-content/uploads/2021/10/adv-for-web.pdf లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.