హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వరుసగా ఇప్పటివరకు ఆరు రౌండ్ ల ఫలితాలు రాదా అని రౌండ్ల లోనూ బిజెపి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 116 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు. ఇక సెకండ్ రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యంను ఈటల రాజేందర్ సొంతం చేసుకున్నారు. అదేవిధంగా మూడవ రౌండ్ ముగిసే సరికి బిజెపి 1273 ఓట్ల లీడింగ్ కు వచ్చింది. ఇక నాలుగో రౌండ్ లో బిజెపి 2542 ఓట్ల ఆధిక్యంలో కి చేరుకుంది.
అదేవిధంగా 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 2169 ఓట్ల లీడ్ తో ఆధిక్యంను సొంతం చేసుకుంది. ఇక ఆరో రౌండ్ లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఆరవ రౌండ్ లో 2971 లీడ్ లో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇలా ఉండగా ప్రస్తుతం వీణవంక మండలం కు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఈ మండలాల్లో టిఆర్ఎస్ బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఈ మండలాల్లో వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.